అందమైన నా పల్లె
అందమైన నా పల్లె
పల్లెకు స్వాగతం చెపుతున్న
అందమైన చెట్లు పచ్చని పొలాలు
ఉదయించే సూర్య కిరణాలతో
ప్రాణం పోసుకుంటున్న తామరలు
తెల్లవారు జామున కోడి కూతలు
ఆహ్వానిస్తూ ముత్యాల ముగ్గులు
ఆప్యాయతలకు పుట్టినిల్లు నా పల్లె అనుబంధాలకు మెట్టినిల్లు
ఏటేటా జరిగే జాతరలు
కనులవిందుగా చూసే కళ్లు
పక్షుల కిల కిలా రాగాలు
సాయంత్రపు సంధ్యా సమయాన
ఆకాశంలో సింధూరం దిద్దుతూ
కలువ రాజును స్వాగతిస్తున్న రవి
అనురాగాలకు నెలవు నా పల్లె
సాంప్రదాయలకు ప్రతీక నా పల్లె
మల్లెపువ్వుల్లా స్వచ్చమైన మనస్సులు విలువలకు పట్టు కొమ్మలు నా పల్లె
అన్ని విధాల అమ్మ తనాన్ని మూటగట్టుకున్న
నా పల్లె నీకు వందనం అభి వందనం.